థార్ కార్లతో బీభత్సం.. విజయవాడలో అమ్మాయి కోసం స్నేహితుల వీరంగం
- విజయవాడలో నడిరోడ్డుపై ఇద్దరు యువకుల బీభత్సం
- ఓ యువతి విషయంలో స్నేహితుల మధ్య మొదలైన గొడవ
- రెండు థార్ కార్లతో ఒకరినొకరు ఢీకొట్టుకుని వీరంగం
- ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో మరొకరు
- భయంతో పరుగులు తీసిన స్థానికులు, వాకర్లు
విజయవాడలో ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సం స్థానికంగా కలకలం రేపింది. చిన్ననాటి స్నేహితుల మధ్య ఓ యువతి విషయంలో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. మాటామాట పెరిగి, ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుని, చివరికి నడిరోడ్డుపై రెండు థార్ జీపులతో ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూ వీరంగం సృష్టించారు. ఈ ఘటన గురువారం రాత్రి విజయవాడ హైటెన్షన్ రోడ్డు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. విజయవాడ తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్ (ఇంజినీరింగ్ విద్యార్థి), భారతీ నగర్‌కు చెందిన బొల్లా ఓమ్ (రియల్ ఎస్టేట్ వ్యాపారి) చిన్నతనం నుంచి మంచి స్నేహితులు. అయితే, కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఓ యువతి విషయంలో మనస్పర్థలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి ఓమ్.. రోహిత్‌కు ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగాడు. ఇద్దరి మధ్య ఫోన్లోనే తీవ్ర వాగ్వాదం జరిగింది. తాను పటమట ఆర్ఆర్ గార్డెన్ హైటెన్షన్ రోడ్డులో ఉన్నానని రోహిత్ చెప్పడంతో ఇద్దరి మధ్య సవాళ్లు నడిచాయి.
దీంతో ఆగ్రహానికి గురైన ఓమ్, తన థార్ జీపు తీసుకుని రోహిత్ ఉన్న చోటకు వెళ్లాడు. అక్కడ ఉన్న రోహిత్ జీపును బలంగా ఢీకొట్టాడు. దీంతో రోహిత్ కూడా తన కారుతో ఓమ్ జీపును ఢీకొట్టాడు. రెండు వాహనాలు ధ్వంసమవుతున్నా వెనక్కి తగ్గకుండా ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూ రోడ్డుపై కొంతదూరం ఈడ్చుకెళ్లారు. ఆ సమయంలో రోడ్డుపై వాకింగ్ చేస్తున్న వారు, స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. అంతటితో ఆగకుండా ఇద్దరూ వాహనాలు దిగి, రాడ్లతో జీపుల అద్దాలను పగలగొట్టుకున్నారు.
ఈ బీభత్సాన్ని చూసిన కొందరు స్థానికులు వెంటనే సమీపంలోని పటమట పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో రోహిత్ తన జీపును అక్కడే వదిలేసి పరారయ్యాడు. పోలీసులు ఓమ్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ గొడవ జరిగిన సమయంలో ఓ జీపులో సదరు యువతి, మరో జీపులో మరికొందరు యువకులు ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న రోహిత్ కోసం గాలిస్తున్నారు.